Friday 6 April 2012

DANUSH NEW 3 MOVIE REVIEW





చిత్రం: 'త్రీ'
నటీనటలు : ధనుష్, శృతి హాసన్, ప్రభు, భానుప్రియ, రోహిణి తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం: ఐశ్వర్యా ధనుష్
ప్రొడక్షన్ : కస్తూరి రాజా
నిర్మాతలు:కె.విమలాగీత, నట్టికుమార్‌

ఒక సూపర్ హిట్టు సాంగ్ తో సినిమాని నిలబెట్టగలమా...కష్టం అని స్పష్టమవుతుంది 'త్రీ' సినిమా చూస్తే. 'కొలవెరి డి...'పాటతో రిలీజ్ కు ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'త్రీ' తెలుగులోనూ అట్టహాసంగానే విడుదలైంది. ధనుష్ భార్య ఐశ్వర్య దర్సకురాలిగా పరిచయమతూ చేసిన ఈ చిత్రం అంచనాలకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఫస్టాఫ్ చక్కటి ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్ లో హఠాత్తుగా మాయరోగాన్ని రంగంలోకి దింపి ప్రేక్షకులను సహన పరీక్ష పెట్టింది.

రామ్(ధనుష్), జనని(శ్రుతిహాసన్) టీనేజ్ లోనే ప్రేమలో పడి కొంచెం అటూ ఇటూగా ఇష్టం లేని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. చక్కగా సంసారం సాగుతోందనుకున్న సమయంలో రామ్ ఓ లెటర్ రాసి ఆత్మ హత్య చేసుకుంటాడు. ఆత్మ హత్య చేసుకునేంత కష్టం రామ్ కి ఏమి వచ్చింది... అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మర్డర్ మిస్టరీ ముడి విప్పుతున్నట్లుగా థ్రిల్లర్ నేరేషన్ లో మొదలయ్యే ఈ చిత్రం ఎరిక్ సీగల్ 'లవ్ స్టోరీ'ని గుర్తు చేస్తూ మెల్లగా సాగుతుంది. ఫస్టాఫ్ టీనేజ్ లో కలిగే తొలి ప్రేమ, తియ్యటి అనుభూతులు, పెద్దలకు తెలియకుండా కలవటం ఒకరిని మరొకరు విడిచిపెట్టలేకపోవటం వంటి అందరికీ నిజ జీవితంలో అనుభవమయ్యే విషయాల చుట్టూ తిరుగుతూ కనెక్టు చేస్తుంది. అయితే సెకండాఫ్ కి వచ్చే సరికి హీరో ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడనే విషయం విప్పేటప్పుడే విరిక్తి కలిగించింది. అక్కడ సీన్స్ అన్నీ చాలా డ్రైగా మారిపోయాయి. దాంతో ఫస్టాఫ్ లో కలిగిన ఫీల్ మొత్తం ఒకేసారి ఆవిరి అయిపోయింది. సెంటిమెంట్‌తో పండుతాయని అల్లుకున్న సీన్స్ అరవ అతిలాగ మారిపోయి నవ్వులు పండిచాయి. థ్రిల్లర్ నేరేషన్ లో మొదలెట్టిన కథనం.. కేవలం ఆసక్తి రేపటానికే ఉపయోగపడింది కానీ థ్రిల్ కి గురి చేయలేకపోయింది.

అక్కడికీ ధనుష్, శృతిహాసన్ తమ పరిధిలో చాలా బాగా చేసారు. ముఖ్యంగా శృతి హాసన్ ఫస్టాఫ్ లో ఇంత నటన చేసే సత్తా ఆమెలో ఉందని తెలిసి ఆశ్చర్యపోయేలా చేసింది. టీనేజ్ పిల్లల్లా ధనుష్, శృతి ఇద్దరూ తమ వయస్సులను తగ్గించుకున్న విధానం అద్బుతమనిపిస్తుంది. ఇక దర్శకురాలు ఐశ్వర్య కూడా శక్తి వంచన లేకుండా తమ బావ గారైన సెల్వ రాఘవన్ ని గుర్తు చేస్తున్నట్లుగా మంచి టేకింగ్ తో ఫస్టాప్ ని బాగా పండించింది. అయితే సెకండాఫ్ పండితేనే కదా సినిమా హిట్ అయ్యేది. సీనియర్ నటులు భానుప్రియ, ప్రభు ఎప్పటిలాగే బానే చేసారు. పాటల్లో వై దిస్ కొలావరి పాట ...యూ ట్యూబ్ లో కిక్ ఇచ్చినట్లుగా వెండి తెరపై ఇవ్వలేకపోయింది. సినిమాకి అది ప్లస్ గా మారలేక పోయింది. డైలాగులు సీన్లకు తగ్గట్లు కంటెంట్ ని క్యారీ చేస్తూ సాగిపోయాయి. ఇక డెప్త్ తగ్గుతుందనుకున్నారో ఏమో కానీ కామెడీకి మాత్రం సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు. కెమెరా, ఎడిటింగ్ బాగున్నాయి. సినిమానే కాకుండా కథ కూడా రిచ్ గా ఉండేటట్లు చూసుకుంటే బావుండేది అనిపించింది.

ఫైనల్ గా మరీ ప్రేక్షకుడిని పట్టించుకోనట్లు 'త్రీ మచ్' గా తీసిన ఈ సినిమా విషాదాంత ప్రేమ కథలు అంటే ఇష్టపడేవారికి నచ్చే అవకాసం ఉంది. మిగతావాళ్లు ఫస్టాఫ్ వరకూ ఎంజాయ్ చేసి వచ్చేయటం బెస్ట్. డబ్బులు ఇచ్చాం కదా ఎసి అన్నా గిట్టుబాటు అవుతుంది అని సినిమా పూర్తిగా చూసేస్తే విరుగుడు కోసం యూ ట్యూబ్ లో కొలవెరి డీ పాటను మళ్లీ వినక తప్పదు

0 comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...