చిత్రం: రచ్చ
బ్యానర్: మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రై.లిమిటెడ్
నటీనటులు: రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్, కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, పార్తీబన్, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు
సమర్పణ :ఆర్.బి.చౌదరి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
రచన: పరుచూరి బ్రదర్స్
ఎడిటింగ్: గౌతంరాజు
కళ: ఆనంద్‌సాయి
కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
'ఏదో చెప్పి తొడలు కొట్టే రకాన్ని కాదురా నేను', 'నా అబ్బను అంటే ఎవడి అబ్బనయినా నరుకుతా'వంటి డైలాగులతో 'రచ్చ'.. రచ్చ చేయటానికి థియేటర్లోకి దూకింది. అలాగే పంచ్ డైలాగులు, ఫార్ములా కథతో ఈ మాస్ సినిమాని రూపొందించి ఓ వర్గాన్ని ఆనందపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాఫ్ సరదా సరదాగా ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోయిన ఈ సినిమా సెకండాఫ్ కి వచ్చేసరికి పాతబడిన 'బన్నీ'తరహా ఫ్లాష్ బ్యాక్ తో బయిటపడాలనే ప్రయత్నం చేసింది. అప్పటికీ రామ్ చరణ్ తనదైన స్టైలిష్ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు.
బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్) ఎప్పటిలాగే బెట్టింగ్ లు కడుతూ కుటుంబాన్ని లాక్కొస్తూంటాడు. అయితే అనుకోకుండా అతని పెంపుడు తండ్రి(ఎమ్.ఎస్ నారాయణ)తెగ తాగి లివర్ పాడుచేసుకుంటే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద ఎమౌంట్ కోసం హీరో అతి పెద్ద బెట్ కి సిద్దమవుతాడు. చైత్ర(తమన్నా) అనే టైట్ సెక్యూరిటీ ఉన్న కోటీశ్వరురాలు కూతురుని లవ్ లో పడేస్తానని పందెం కాస్తాడు. అందుకోసం అతను రాత్రింబవళ్లూ ఆమె చుట్టూ తిరిగి... ఆమెను ఆకట్టుకోవటం కోసం సాహసాలు చేస్తూ.. పాటలు పాడుతూంటాడు. సరిగ్గా పందెం గెలచామనుకునే సమయానికి అతనికో నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ చైత్ర ఎవరు... ఏంటా నిజం అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఫస్టాఫ్.. ఎంటర్టైన్మెంట్.. సెకండాఫ్.. యాక్షన్ అంటూ ఫార్ములా ప్రకారం స్క్రిప్టుని విడతీసి మరీ స్క్రీన్ ప్లే చేసుకున్న ఈ చిత్రం ఫస్టాఫ్.. హీరోయిన్ పడేయటానికి హీరో చేసే ట్రిక్కులతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఎప్పుడన్నా ఎంటర్నైమెంట్ తగ్గుతుందనుకుంటే... బ్రహ్మానందం వంటి కమిడెయిన్స్ తో లాగేసారు. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి... అసలు కథ ఏమిటి... హీరో, హీరోయిన్స్ గతం ఏమిటి.. వాళ్లిద్దరికి ఉన్న రిలేషన్ ఏమిటి.. ఈ ప్రేమ పందెం కాయటం వెనక ఉన్న అసలు రీజన్ ఏమిటి వంటి సవాలక్ష సందేహాలకు సమాధానం చెప్పటం కోసం ప్లాష్ బ్యాక్ వెయ్యాల్సి వచ్చింది.

0 comments:
Post a Comment